Header Ads Widget

Keedaa Cola Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ 'కీడా కోలా'.. కానీ వారికి మాత్రమే..

 Keedaa Cola Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ 'కీడా కోలా'.. కానీ వారికి మాత్రమే..



ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన లు చాలానే ఉన్నాయి. అందులో 'కీడా కోలా' ఒకటి. డైరెక్టర్ కమ్ నటుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం నవంబర్ 3న విడుదలైంది.


పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి లతో హిట్స్ అందుకున్న తరుణ్.. మరోసారి కీడా కోలా తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో బ్రహ్మానందం, చైతన్య మందాడి, రాగ్ మయుర్ ప్రధాన పాత్రలలో నటించారు. క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ ను దగ్గుబాటి రానా సమర్పణలో నిర్మించారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత తెరకెక్కించిన ఈ భారీగా వసూళ్లు రాబట్టింది. తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ తోపాటు.. ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ . థియేటర్లలో సక్సెస్ అయిన ఈ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.


ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో ఈ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ హోల్డర్లకు మాత్రమే ఈ అందుబాటులో ఉంది. మిగిలిన సబ్ స్క్రైబర్లకు రేపటి నుంచి (డిసెంబర్ 29) నుంచి ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు థియేటర్లలో కడుపుబ్బా నవ్వించిన ఈ ను ఇప్పుడు ఇంట్లోనే చూడొచ్చు. 

Post a Comment

0 Comments