హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి తెలియని తెలుగువారుండరు. వెండితెరపై ఆయన కనిపించగానే ప్రేక్షకుల పెదవులపైకి చిరునవ్వు వచ్చేస్తుంది. డైలాగ్స్, బాడీ మ్యానరిజం, ఎక్స్‌ప్రెషన్స్‌తోనే కామెడీని పండించగల అద్భుతమైన నటుడు.
తన కామెడీతో ఎన్నో ఏళ్లుగా తెలుగువారిని నవ్విస్తూనే ఉన్నాడు. అంతేకాదు మీమ్ గాడ్. సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే చాలు మీమ్స్ పేజీలలో ఆయనే కనిపిస్తున్నారు. తన గురించి వచ్చే కామెడీని సైతం పాజిటివ్‌గా తీసుకుంటారు. ఎన్నో ల్లో నటించి తెలుగు సినీ చరిత్రపై తనదైన ముద్ర వేశారు. కేవలం నటుడిగానే కాకుండా ఆర్టిస్ట్‌గానూ బ్రహ్మానందం తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో తనలోని మరో టాలెంట్ బయటకు తీసువచ్చారు. పెన్సిల్‌తోనే అద్భుతమైన చిత్రాలను గీసి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు రచయితగానూ మారారు. తన 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని వివరిస్తూ 'నేను' అనే పుస్తకరం రాశారు. తన సినీ ప్రయాణంలో ఎదురైన వ్యక్తులు, తెలుసుకున్న విషయాలపై ఈ పుస్తకంలో రాసుకొచ్చారు. బ్రహ్మానందం రాసిన 'నేను' పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.
'నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా .. తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు,తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా 'నేను' అనే పుస్తకరూపంలో మనకందించటం ఎంతో ఆనందదాయకం. తానే చెప్పినట్టు 'ఒకరి అనుభవం,మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు ,మార్గదర్శకము అవ్వొచ్చు. ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ పుస్తక ప్రచురణకర్తలయిన 'అన్వీక్షికి' వారిని అభినందిస్తున్నాను! ' అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్.
0 Comments