Header Ads Widget

Raviteja: ఆ సినిమాకు రోజుకు 10 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న రవితేజ.. ఇప్పుడు ఒక్కో మూవీకి ఎంతంటే..

 Raviteja: ఆ సినిమాకు రోజుకు 10 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న రవితేజ.. ఇప్పుడు ఒక్కో మూవీకి ఎంతంటే..




మాస్ మాహారాజా రవితేజ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటుడు కావాలనే ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.


మొదటి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన రవితేజ.. ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగారు. ఏడాదికి రెండు, మూడు లు చేస్తూ యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ.. ఈ ఏడాది మాత్రం వరుస లతో బాక్సాఫీస్‏ను షేక్ చేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న రవితేజ.. కెరీర్ ప్రారంభంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. నటుడు కావాలనే ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన.. మొదట అసిస్టెండ్ డైరెక్టర్‏గా పనిచేశారు.


అదే సమయంలో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవాడు. మెల్లగా హీరో ఫ్రెండ్‍గా కనిపించే రోల్స్ చేశాడు. కేవలం పాజిటివ్ కాదు.. విలనిజం సైతం చూపించాడు. కొన్ని చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించాడు. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సింధూరం లో సెకండ్ హీరోగా కనిపించాడు రవితేజ. ఈ సూపర్ హిట్ అయ్యింది అంతేకాకుండా రవితేజకు హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ తర్వాత ఆయనకు హీరోగా వరుస అవకాశాలు క్యూ కట్టాయి. శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ నటించిన నీకోసం సైతం హిట్ అయ్యింది. అయితే ఈ మూవీ తర్వాత రెండేళ్లు లకు దూరంగా ఉన్నాడు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న రవితేజ.. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.


ఆ తర్వాత వరుస లు చేస్తూ మాస్ మహారాజాగా ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ ఏడాది టైగర్ నాగేశ్వర రావు తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. ఇప్పుడు ఈగిల్ లో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రవితేజకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన అల్లరి ప్రియుడు లో రవితేజ కీలకపాత్రలో కనిపించాడు. అప్పట్లో ఆ కోసం రోజుకు రూ. 10 రెమ్యునరేషన్ తీసుకునేవాడట. కానీ ఇప్పుడు ఒక్కో కు రూ.30 కోట్లు అందుకునే స్థాయికి చేరుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడం రవితేజ కష్టానికి ప్రతిఫలం అనే చెప్పాలి.

Post a Comment

0 Comments